నాని ది ప్యారడైజ్ నుంచి "రా స్టేట్మెంట్.". ఎప్పుడంటే.?

నాని ది ప్యారడైజ్ నుంచి "రా స్టేట్మెంట్.". ఎప్పుడంటే.?

టాలీవుడ్ స్టార్ హీరో నేచురల్ స్టార్ నాని  'ది ప్యారడైజ్' అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి గతంలో నాని కి దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. తమిళ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. గత ఏడాదిలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెట్స్ మీదకి వెళ్ళింది. కానీ శ్రీకాంత్ ఓదెల చాలా ఫాస్ట్ గా షూటింగ్ పూర్తి చేసే పనిలో పడ్డాడు. దీంతో ఇప్పటికే దాదాపుగా 60% శాతం షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. 

అయితే హీరో నాని బర్త్ డే సందర్భంగా శ్రీకాంత్ ఓదెల ఫ్యాన్స్ కి స్పెషల్ గిఫ్ట్ ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా మార్చ్ 3న ది ప్యారడైజ్ సినిమాకి సంబందించిన "రా స్టేట్‌మెంట్" రిలీజ్ చేస్తామని సోషల్ మీడియాలో వెల్లడించారు. అంతేగాకుండా హీరో నానికి బర్త్ డే విషస్ తెలిపారు. దీంతో నాని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు నాని హీరోగా నటిస్తున్న "హిట్: ది థర్డ్ కేస్" టీజర్ రిలీజ్ కావడం, ది ప్యారడైజ్ సినిమాకి సంబందించిన అప్డేట్స్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం దక్కించుకున్నాడు. ఈ సినిమాని హీరో నాని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం చిరంజీవి "విశ్వంభర" సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. దీంతో శ్రీకాంత్ ఓదెల సినిమా ఆగస్టు లేదా సెప్టెంబర్ లో ప్రారంభం కానున్నట్లు సమాచారం..