TheParadise: ఏనుగు నడిస్తే.. కుక్కలు అరుస్తాయి.. ‘దిప్యారడైజ్‌’రూమర్స్‌కు ఇచ్చేపడేసిన టీమ్

TheParadise: ఏనుగు నడిస్తే.. కుక్కలు అరుస్తాయి.. ‘దిప్యారడైజ్‌’రూమర్స్‌కు ఇచ్చేపడేసిన టీమ్

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తోన్న చిత్రం 'ది ప్యారడైజ్'. ఈ సినిమా వచ్చే ఏడాది ఇదే రోజు(మార్చ్ 26)న విడుదల కానుంది. ఇటీవలే వరుస అప్డేట్స్ ఇస్తూ వచ్చింది. ఈ క్రమంలో డబ్బుల్లేక సినిమా ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ రూమర్స్ ను ‘ది ప్యారడైజ్‌’టీమ్ కొట్టేపారేస్తూ.. తమదైన శైలిలో ఇచ్చేపడేసింది.

‘ది ప్యారడైజ్‌’షూటింగ్ మరింత వేగంగా జరుగుతోంది. సినిమా గొప్పగా రావడానికి మేకర్స్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. అభిమానులందరూ నిశ్చింతగా ఉండండి. అనుకున్నట్టుగానే మూవీ సరైన మార్గంలో ఉంది.  త్వరలో మీరందరూ దానిని చూస్తారు. ఇక రూమర్స్ క్రియేట్ చేసేవాళ్లు ఇలాంటి ఫేక్ సమాచారం ఇస్తూ బతికేయండి. ఎందుకంటే 'గజరాజు (ఏనుగు) నడిస్తే..గజ్జి కుక్కలు అరుస్తాయి..' కదా!.

మేము ఈ సినిమాపై అభిమానులు చూపిస్తున్న ప్రేమను అనుక్షణం గమనిస్తున్నాం. అలాగే ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసే వారిని కూడా గమనిస్తున్నాం. వాటన్నిటితో ఒక శక్తిగా ఎదుగుతాం. టాలీవుడ్‌ చరిత్రలోనే ‘ది ప్యారడైజ్‌’ గర్వించే సినిమా అవుతుంది. ఇలాంటి రూమర్స్‌ ప్రచారం చేసేవారంతా త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం. ఈ మూవీ కోసం అన్ని విభాగాలు అంతా నిరంతరం శ్రమిస్తోంది. అభిమానులంతా గర్వపడే చిత్రంతో నాని మీ ముందుకువస్తారని వాగ్దానం చేస్తున్నాం’’ అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

2024 ఏడాదిలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెట్స్ మీదకి వెళ్ళింది. ఇపుడు శ్రీకాంత్ ఓదెల చాలా ఫాస్ట్ గా షూటింగ్ పూర్తి చేసే పనిలో పడ్డాడు. దీంతో ఇప్పటికే దాదాపుగా 70% శాతం షూటింగ్ పూర్తయినట్లు సమాచారం.

ఇకపోతే, ఈ సినిమాకి డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ సినీ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. తమిళ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.

ALSO READ | డిఫరెంట్ కథతో థ్రిల్ చేసే బ్లడ్ రోజెస్..