- ఆర్థిక నేరస్థులకు బేడీలు వేయొద్దు..
- పార్లమెంటరీ కమిటీ సిఫార్సు
ఢిల్లీ : ఆర్థిక నేరాలకు పాల్పడిన వారి విషయంలో పార్లమెంటరీ కమిటీ పలు కీలక సూచనలు చేసింది. ఆర్థిక నేరాలకు పాల్పడి కస్టడీకి తీసుకున్న వారి చేతికి బేడీలు వేయవద్దని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది. బీజేపీ ఎంపీ బ్రిజ్‌లాల్ నేతృత్వంలోని హోం వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం భారతీయ నాగరిక్ సురక్ష సంహిత(బీఎన్ఎస్ఎస్) ప్రకారం ఒక ఆర్థిక నేరగాడిని అరెస్టు చేసిన మొదటి 15 రోజులకు మించి పోలీసు కస్టడీలో ఉంచినప్పుడు సంబంధించిన మార్పులను సూచించింది.
'ఆర్థిక నేరాలు' అనే పదాన్ని తొలగించడానికి క్లాజ్ 43(3)ని సవరించవచ్చని ప్యానెల్ తెలిపింది. ఆ క్లాజ్ ప్రకారం.. పోలీసు అధికారి నేర స్థాయినిబట్టి కస్టడీ నుంచి మాటిమాటికి తప్పించుకుంటున్న ఒక వ్యక్తిని అరెస్టు చేసే సమయంలో చేతికి సంకెళ్ళు ఉపయోగించవచ్చు.
ALSO READ :- అలంపూర్ నామినేషన్ల పరిశీలనలో హైడ్రామా