మునుగోడులో యూత్‌‌ను ఆకట్టుకునే వ్యూహాల్లో ప్రధాన పార్టీలు

నల్గొండ, వెలుగు:మునుగోడు బైపోల్‌‌లో అభ్యర్థుల భవితవ్యం యువత మీదే ఆధారపడి ఉంది. నియోజకవర్గంలో యువ ఓటర్లు ఎక్కువగా ఉండడంతో అన్ని పార్టీలు వారి మీదే ఫోకస్ పెట్టాయి. ఇక్కడ దాదాపు సగం మంది ఓటర్లు యువతే కావడంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపుతున్నాయి. వారిని ఆకట్టుకునేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నాయి. ప్రచారం కోసం ఆయా పార్టీలు తమకు అనుబంధంగా ఉన్న యువజన, విద్యార్థి విభాగాలను పంపాయి. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పని చేసిన యూత్ లీడర్లను, వివిధ యూనివర్సిటీలకు చెందిన స్టూడెంట్స్ యూనియన్ల నేతలను రప్పిస్తున్నాయి. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌‌తోపాటు బీఎస్పీ, టీజేఎస్ కూడా యూత్‌‌ టార్గెట్‌‌గా ముందుకు సాగుతున్నాయి.

మండలానికో టీమ్‌‌ను పంపిన టీఆర్ఎస్‌‌

మునుగోడులో 2.41 లక్షల మంది ఓటర్లు ఉండగా.. 18 నుంచి 39 ఏండ్ల మధ్య ఉన్న ఓటర్లు 1,25,668 మంది ఉన్నారు. తాజాగా వయసుల వారీగా అధికారులు విడుదల చేసిన గణాంకాలను చూసి టీఆర్ఎస్‌‌లో టెన్షన్ మొదలైంది. ఆసరా, రైతుబంధు, రైతుబీమా లాంటి సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని ఆ పార్టీ నమ్ముకున్నది. ఈ వర్గాల వారంతా తమవైపే ఉంటారని ధీమాగా ఉన్నద

నిరుద్యోగ సమస్యపై బీజేపీ, కాంగ్రెస్ ఫోకస్

మునుగోడులో యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు అనుబంధంగా ఉన్న   ఏబీవీపీ, ఎన్ఎస్​యూఐ, యూత్ కాంగ్రెస్ సంస్థలు ప్రత్యేక కార్యాచరణతో ప్రచారంలోకి దిగాయి. నిరుద్యోగ సమస్య, నిరుద్యోగ భృతి హామీ అమలు కాకపోవడాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్తున్నాయి. ‘‘మీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తే మంచి జీతాలు వచ్చేవి కదా.. సర్కారు ఉద్యోగాలు ఇవ్వకుండా మీకు వెయ్యి రూపాయల పెన్షన్ ఇస్తే ఏం లాభం?’’ అంటూ పెద్దలను ఆలోచింపజేస్తున్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకతతో యువత తమ పార్టీకి దగ్గర అవుతున్నట్లు బీజేపీ భావిస్తోంది. తమ సర్వేల్లోనూ ఇదే విషయం బయటపడినట్లు పార్టీ నేతలు అంటున్నారు. బీజేపీ యూత్, స్టూడెంట్ లీడర్లు బూత్ లెవల్ టీమ్‌‌లతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్ఎస్‌‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో కార్యకర్తలు లక్ష మంది ఓటర్లకు పాదాభివందనం కార్యక్రమాన్ని చేపట్టారు. ‘ప్రజాస్వామ్యానికి పాదాభివందనం’ పేరిట ఇంటింటికీ వెళ్లి, పెద్దవాళ్ల కాళ్లు మొక్కడంతోపాటు, యువకులతో చర్చలు జరుపుతున్నారు. 

కానీ పెన్షనర్లు 40 వేల మందికి మించి లేకపోవడంతో టీఆర్ఎస్ పెద్దలు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు యువ ఓటర్లలో అత్యధికులు నిరుద్యోగులే. ఎనిమిదేండ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు సరిగ్గా ఇవ్వకపోవడంతో యువతీ యువకుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నట్లు ఇంటెలిజెన్స్ రిపోర్టుల్లో ఇప్పటికే వెల్లడైంది. దీంతో ఈ వ్యతిరేకతను అధిగమించి.. యూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆకట్టుకునేందుకు పార్టీ హైకమాండ్​ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. యూత్ లీడర్లకు శిక్షణ ఇచ్చి రంగంలోకి దింపారు. మండలానికి 30 మంది చొప్పున మంగళవారం నుంచి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పాత్ర, ఐటీ తదితర రంగాల్లో రాష్ట్ర ప్రగతి గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ తదితర సంఘాలు కూడా  ప్రచారంలోకి దిగాయి.