పార్టీకి ద్రోహం చేసిన ఎమ్మెల్యేకు బుద్ది చెప్పాలి : జూపల్లి

కొల్లాపూర్, వెలుగు: కాంగ్రెస్​ నుంచి గెలిచి పార్టీకి ద్రోహం చేసిన ఎమ్మెల్యేకు పార్టీ కార్యకర్తలు బుద్ది చెప్పాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. కోడేరు మండలం పసుపుల గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్​ పార్టీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పార్టీ నాయకులతో కలిసి గ్రామంలో ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్​​అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టబోయే సంక్షేమ పథకాల గురించి వివరించారు. గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ALSO READ  : రైతుల అభివృద్ధి కోసం అనేక పథకాలు : మాలోతు కవిత

ప్రతి ఒక్కరూ పార్టీ గెలుపుకోసం కృషిచేయాలన్నారు. గత ఎన్నికల్లో కార్యకర్తలు కష్టపడి ఎమ్మెల్యేను గెలిపిస్తే తనపై పోరాడలేక 3 నెలలకే అధికార పార్టీకి  అమ్ముడుపోయాడని ఎద్దేవా చేశారు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్లిన చరిత్ర కొల్లాపూర్​లో ఎవరికీ లేదని, పార్టీని మోసం చేసిన వారికి కాంగ్రెస్​ కార్యకర్తలే తగిన బుద్ది చెప్పాలన్నారు.