తర్వాత ఏమైందీ : 110 స్పీడ్ తో వెళ్తున్న రైలు నుంచి జారి పడ్డాడు..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పుర్‌ రైల్వేస్టేషనులో 110 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న పాటలీపుత్ర ఎక్స్‌ప్రెస్‌ రైలు నుంచి ఓ ప్రయాణికుడు జారిపడ్డాడు. సుమారు వంద మీటర్ల మేర ప్లాట్‌ఫాం మీద అలాగే జారుతూ రైలుతోపాటు ముందుకు వెళ్లాడు..

ఈ మధ్య కాలంలో యూత్ ఎంజాయిమెంట్ కు అడ్డు అదుపు లేకుండా పోతోంది. బస్సుల్లో ప్రయాణించేటప్పుడు జనాలు డోర్ దగ్గరేనిలబడతారు...ఎక్కేవారు..దిగేవారు ఇబ్బంది పడుతున్నా అసలు ఏ మాత్రం పట్టించుకోరు.ఇక రైళ్లల్లో కూడా కొంతమంది  ప్రయాణించేటప్పుడు డోర్ దగ్గర మెట్లపై కూర్చొని విన్యాసాలు చేస్తుంటారు. ట్రైన్ అంటే దాదాపు 100 కిలోమీటర్ల వేగంతో వెళుతూ ఉంటుంది.  ఇలా నిర్లక్ష్యంగా డోర్ల దగ్గర వద్దని చెప్పినా వినరు.. ప్రమాదకరమని చెప్పినా పట్టించుకోరు.  కొంతమంది ప్రమదాల బారిన పడి తీవ్రగాయాల పాలైతే..మరికొందరు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే హైస్పీడ్‌తో వెళ్తున్న రైలు నుంచి పడితే..? ఊహించుకోవడానికే భయంగా ఉంది కదా..? ఉత్తర్‌ ప్రదేశ్‌లో తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. 110 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న రైలు నుంచి ఓ వ్యక్తి జారిపడ్డాడు.

ALSO READ: హైవే సైన్ బోర్డ్ పై పుష్ అప్స్.. మిట్ట మధ్యాహ్నం కిక్ అంటే ఇదీ..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో జరిగింది ఈ ఘటన. పాటలీపుత్ర ఎక్స్‌ప్రెస్‌ రైలు 110 కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది. డోర్‌ దగ్గరే నిలబడినట్లు ఉన్నాడు ఓ ప్రయాణికుడు ప్రమాదవశాత్తు జారి ప్లాట్‌ఫాంపై పడ్డాడు. దాంతో ఆ వ్యక్తి దాదాపు 100 మీటర్ల వరకు జారుతూ వెళ్లాడు. అయితే.. రైల్వే స్టేషన్‌లో ఉన్న ఒకరు ట్రైన్‌ను వీడియో తీస్తుండగా ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. అంత వేగంతో వెళ్తున్న రైలు నుంచి పడ్డా కూడా  ఆ వ్యక్తి మళ్లీ లేచి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతనికి స్వల్ప గాయాలు మినహా ఏం కాలేదు. ఈ సీన్‌ను చూసిన రైల్వే స్టేషన్‌లో ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. ఏం జరగనట్లు ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. అతని అదృష్టం బాగుందని.. భూమి పైనా ఇంకా నూకలు ఉన్నాయని అంటున్నారు. కాగా.. ప్రమాదానికి గురైన వ్యక్తి వివరాలు తెలియరాలేదు.

https://twitter.com/DDNewsAndhra/status/1671426598963388416