అమల్లోకి ఇజ్రాయెల్​, హమాస్​ శాంతి ఒప్పందం

అమల్లోకి ఇజ్రాయెల్​, హమాస్​ శాంతి ఒప్పందం

గత 15 నెలలుగా ఇజ్రాయెల్, హమాస్​ మధ్య జరుగుతున్న భీకర పోరాటానికి తాత్కాలికంగా తెరపడింది. శిథిలాల దిబ్బగా మారిన గాజాలో ప్రాణనష్టం, ఆస్తినష్టం తగ్గించడం, లక్షల మంది జీవితాలను సాధారణ స్థితికి తీసుకురావడమే లక్ష్యంగా ఇరుపక్షాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జనవరి 19 నుంచి అమలులోకి వచ్చింది. ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికా, ఈజిప్ట్, ఖతార్​ మధ్యవర్తిత్వం వహించాయి. ఈ ఒప్పందం మొదట ఆరు వారాలపాటు అమలులో ఉండనున్నది. ఇందులో భాగంగా ఇజ్రాయెల్​ బలగాలు గాజాను క్రమంగా వీడుతాయి. 

  •     2023, అక్టోబర్ 7న ఇజ్రాయెల్​పై హమాస్​ చేసిన మెరుపుదాడిలో 1200 మందికిపైగా ఇజ్రాయెల్​ పౌరులు మృతిచెందగా, 250 మందిని హమాస్​ మిలిటెంట్లు బందీలుగా చేసుకున్నారు. దీంతో హమాస్​ పై ఇజ్రాయెల్​ విరుచుకుపడింది.
  •     హమాస్​ అగ్రనేతలు ఇస్మాయెల్​ హనియా, యహ్యా సిన్వార్​తోపాటు కీలక నేతలను హతమార్చింది. గాజాపై ఇజ్రాయెల్​ చేసిన దాడుల్లో 46 వేల మందికి పైగానే పాలస్తీనీయులు 
  • మరణించారు. 
  •     యుద్ధంలో ధ్వంసమైన గాజా తిరిగి కోలుకోవడానికి 350 సంవత్సరాల సమయం పట్టవచ్చని అంచనా వేయడంతోపాటు కనీసం 18.5 బిలియన్ల అమెరికా డాలర్ల నిధులు అవసరం అవుతాయని ఐక్యరాజ్య సమితి తెలిపింది..