పద్మారావునగర్, వెలుగు: గాంధీ ఆస్పత్రి బిల్డింగ్ పైనుంచి బుధవారం ఓ పేషంట్కిందకి దూకడానికి యత్నించగా, సెక్యూరిటీ సిబ్బంది కాపాడారు. ఆస్పత్రి సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన పరశురామ్(35) అనారోగ్యంతో వారం రోజుల కిందట గాంధీ జనరల్ వార్డులో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం గాంధీ మెయిన్ బిల్డింగ్ఫస్ట్ ఫ్లోర్ ఫోర్టికో స్లాబ్ పై నుంచి కిందకి దూకడానికి సిద్ధమయ్యాడు.
దీన్ని చూసిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే చాకచక్యంతో వెనక నుంచి వెళ్లి పేషెంట్ ను పట్టుకుని సురక్షితంగా కిందకు తీసుకువచ్చారు. అనంతరం స్థానిక అవుట్‌పోస్టు పోలీసులకు యువకుడిని అప్పగించగా, వారు అతడికి కౌన్సెలింగ్ ఇచ్చారు. తర్వాత అతడిని ఫ్యామిలీ మెంబర్స్‌కు అప్పగించారు. పరశురామ్ మానసిక స్థితి సరిగా లేదని ఫ్యామిలీ మెంబర్స్తెలిపారు.