ప్రజలు రాకుండానే గ్రామసభ ఎలా ముగిస్తారు.?

  •     ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు

జన్నారం, వెలుగు: ప్రజలు రాకుండానే నామ్ కే వాస్త్ గా మండలంలోని పొనకల్ గ్రామసభను ముగించడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  పల్లె ప్రగతిలో భాగంగా ఏర్పాటు చేసిన పొనకల్ గ్రామ సభలో పారిశుద్ధ్య కార్మికులకు సర్పంచ్, పంచాయతీ  సిబ్బంది సన్మానం చేసి యూనిఫామ్ లను అందజేసి గ్రామసభను ముగించారు. అప్పటికే పలు సమస్యలపై గ్రామసభలో తెలియజేస్తామని వచ్చిన ప్రజలు గ్రామసభ ముగించే సరికి సర్పంచ్ భూమేశ్ తీరుపై, సంబందిత ఆఫీసర్లపై అగ్రహం వ్యక్తం చేశారు.  సమస్యల చెప్పుకుందామని  వస్తే సర్పంచ్ తో పాటు ఆఫీసర్లు గ్రామసభ ముగించుకొని వెళ్లిపోయారని ఇపుడు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దిసేపు గ్రామపంచాయతీ ఆఫీస్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు.