వరంగల్ రూరల్ జిల్లా: వరంగల్ రూరల్ జిల్లాలో దారుణం జరిగింది. దామెర మండలం ముస్తాలపల్లి గ్రామానికి చెందిన కాడారి మహేష్ చంద్ర అనే వ్యక్తిని సజీవదహనం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. మహేష్ చంద్ర చేతులు కట్టేసి సజీవదహనం చేశారు. కుటుంబ కలహాలతోనే చంపేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు.. డెడ్ బాడీని పోస్ట్ మార్టమ్ కోసం హస్పిటల్ కి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై విచారణ మొదలుపెట్టలామని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.