బెంగుళూర్ కు చెందిన వ్యక్తి నగదు చెల్లింపుల్లో భారీ స్కాం చేశాడు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బాధితుడి నుంచి 7.19 కోట్లు కాజేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ హెడ్ క్వార్టర్స్ మరియు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సమన్వయంతో నిందితుడు సునీల్ కుమార్ ను అరెస్ట్ చేశారు. ఆర్థిక లావాదేవీల్లో మోసానికి పాల్పడ్డట్లుగా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన చేశారు.
బాధితుడు నుంచి సునీల్ కుమార్ బ్యాంక్ అకౌంట్ లోకి రూ.38 లక్షల పైగా నగదు బదిలీ చేశాడు. బాధితుడు పార్ట్నర్ ద్వారా సునీల్ అతనికి పరిచయం అయ్యాడు. నిందితుడు 80 బ్యాంక్ అకౌంట్లోకి ఆగస్టు 2023 నుంచి 2024 ఏప్రిల్ 24 వరకు 250 లావాదేవిల ద్వారా 7.19 కోట్లు పంపించుకున్నాడు. నిందితుడు సునిల్ కుమార్ నుంచి ఓ మొబైల్ ఫోన్, ఎటిఎం కార్డుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ALSO READ | హైదరాబాద్‌లో టీ పౌడర్ కల్తీ.. స్పాట్‌లో 200కిలోల కొబ్బరి చిప్పల పొడి