జగిత్యాల జిల్లాలో వింత ఘటన: గ్రామ పంచాయతీ భవనాన్నే తాకట్టు పేట్టేందుకు ప్రయత్నించిన వ్యక్తి

జగిత్యాల: జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం తొంబరావుపేట గ్రామపంచాయతీ భవనాన్ని మాజీ సర్పంచ్ భర్త, కాంట్రాక్టర్ మామిడి ధర్మారెడ్డి తాకట్టు పెట్టే ప్రయత్నం చేశాడు. దీంతో పంచాయతీ సెక్రటరీ పోలీసులకు కంప్లైంట్ చేయడంతో పోలీసులు ఆయనపై భారతీయ న్యాయ సంహిత 353 (2) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. గ్రామపంచాయతీ భవనం నిర్మాణానికి సంబంధించిన బిల్లులు తీసుకున్నప్పటికీ పెండింగ్‎లో ఉన్నాయని కావాలనే బ్యాంకు అధికారులను కాంట్రాక్టర్ సంప్రదించినట్లు కార్యదర్శి శ్యామల పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ALSO READ | నిజాంపేట్-JNTU రూట్లో వెళుతున్నారా..? అయితే అర్జెంట్గా మీకీ విషయం తెలియాలి..!

మండలంలో ఉన్న ఇతర గ్రామాల మాజీ సర్పంచ్లు ఇదేవిధంగా తప్పుదోవ పట్టించి ప్రభుత్వానికి నష్టం కలిగించే విధంగా వ్యవహరించిన కాంట్రాక్టర్ మామిడి ధర్మారెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. ఏకంగా గ్రామపంచాయతీ భవనాన్నే మాజీ సర్పంచ్ భర్త తాకట్టు పెట్టే ప్రయత్నం చేయడంతో జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది.