చిగురుటాకుల వణికిపోతున్న ఫిలిప్పీన్స్‌.. మళ్లీ 6.2 తీవ్రతతో భూకంపం

చిగురుటాకుల వణికిపోతున్న ఫిలిప్పీన్స్‌..  మళ్లీ 6.2 తీవ్రతతో భూకంపం

ఫిలిప్పీన్స్‌.. వరుస భూకంపాలతో వణికిపోతోంది శనివారం (డిసెంబర్ 3న) 7.6 తీవ్రతతో బలమైన భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దేశ రాజధాని మనీలాలోనూ భూమి కంపించింది. యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ ప్రకారం.. ఇప్పుడు 6.2 తీవ్రతతో బూకంపం సంభవించింది. 

సోమవారం (డిసెంబర్ 4న) తెల్లవారుజామున 4 గంటలకు మిండానావో ద్వీపంలోని హినాటువాన్ మున్సిపాలిటీలో మరోసారి భూమి కంపించింది. దీని తీవ్రత 6.9గా నమోదయిందని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే (USGS) చెప్పింది. భూ అంతర్భాగంలో 30 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని తెలిపింది. హినాటువాన్‌కు 72 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని చెప్పింది. 

భూకంపం ప్రభావంతో తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. శనివారం నాటి భూకంపం వల్ల ఇద్దరు మరణించారు. పలువురిని పునరావాస కేంద్రాలకు తరలించామని అధికారులు వెల్లడించారు.