సంక్రాంతి వచ్చిందంటే కోడి పందేలు, ఎడ్ల పందేలు చూస్తూనే ఉంటాం. అయితే ఇక్కడ కోళ్ల పందేలు కాదు పందుల పోటీలు నిర్వహిస్తున్నారు. వినడానికి కొత్తగా.. చూడటానికి ఆశ్చర్యంగా ఉన్నా... వనపర్తి జిల్లాలో జరుగుతున్న పందుల పోటీలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఆత్మకూరు మండల పరిధిలోని కృష్ణా నదీ తీరంలో ఆదివారం ఊరపందుల మధ్య పోటీలు నిర్వహించారు. ఏపీ నుంచి వచ్చిన నిర్వాహకులు వనపర్తిలో మొదటిసారి పిగ్ ఫైటింగ్ నిర్వహించారు. అయితే ప్రతి ఏడాది కోడిపందేలు నిర్వహించేవారని.. వాటిని నిషేధించడంతో పిగ్ ఫైట్ నిర్వహించారని స్థానికులు చెబుతున్నారు. తొలి రోజు 12 పోటీలు జరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పందులను పోటీకి దింపారు.
మరిన్ని వార్తల కోసం: