పక్షి ఢీ కొట్టడంతో విమానంలో మంటలు.. న్యూజెర్సీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

పక్షి ఢీ కొట్టడంతో విమానంలో మంటలు.. న్యూజెర్సీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

వాషింగ్టన్: ఫెడెక్స్ కార్గో విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఓ పక్షి ఢీకొనడంతో ఇంజన్​లో మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన పైలట్ వెంటనే విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అమెరికాలోని న్యూజెర్సీలో ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. పెద్ద ప్రమాదం తప్పిందని, ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని న్యూజెర్సీ ఎయిర్​పోర్ట్ వర్గాలు తెలిపాయి. 

ఫెడెక్స్ కార్గో ఫ్లైట్ ఆదివారం ఉదయం నెవార్క్​లోని లిబర్టీ ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్టు నుంచి ఇండియానాపొలిస్​కు బయల్దేరింది. ప్లేన్ ఎగిరిన కొద్ది నిమిషాల్లోనే ఓ పక్షి ఢీకొంది. దీంతో విమానం కుడివైపు ఇంజిన్​కు మంటలు అంటుకున్నాయి. 

అలర్ట్ అయిన పైలట్ విమానాన్ని దగ్గరలోని న్యూజెర్సీ ఎయిర్​పోర్టులో ల్యాండ్ చేశారు. మంటలు ఎగసిపడుతుండగానే ల్యాండ్ అవుతున్న విమానానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.