హైదరాబాద్, వెలుగు : రబ్బరు సీలింగ్ రింగ్‌లు, రబ్బరు గ్యాస్ కట్లు వంటి రబ్బరు ఉత్పత్తులు తయారు చేసే దీసవాలా రబ్బర్ ఇండస్ట్రీస్ హైదరాబాద్ మేడ్చల్ సమీపంలోని కాళ్లకల్‌లో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది. ఇది 40 వేల చదరపు అడుగుల మేర విస్తరించి ఉంటుందని
దీనికోసం రూ.40 వేల కోట్లు ఇన్వెస్ట్ చేశామని ప్రకటించింది. ఇక్కడ ల్యాబ్ టెస్టింగ్ సదుపాయం కూడా ఉంటుంది. మూడు ప్లాంట్లలో రోజుకు 7-–8 టన్నుల వరకు ఉత్పత్తి జరుగుతుంది. దీనికి తోడు కంపెనీ పక్కనే ఉన్న యూనిట్‌ను కొనుగోలు చేసింది. ఇది 2025 నాటికి మొదలవుతుంది.
హైదరాబాద్‌లోని బాలానగర్‌లో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా 3 తయారీ యూనిట్లు ఉన్నాయని సంస్థ కో–-ఫౌండర్ హునేద్ దీసవాలా చెప్పారు.