ప్రజలు నిలదీస్తారేమోనని శిలాఫలకాన్ని తీసేశారు

ప్రజలు నిలదీస్తారేమోనని శిలాఫలకాన్ని తీసేశారు

కంఘర్ నగర్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్: ‘‘గత జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు మంత్రి కేటీఆర్ కంఘర్ నగర్ లో రెండు పడకల ఇళ్ల కోసం శంకుస్థాపన చేశాడు.. ఐదేళ్లు ఆయినా ఒక్క ఇటుక కూడా వేయలేదు.. ప్రజలు ఎక్కడ నిలదిస్తారోనని శిలాఫలకాన్ని సైతం తీసివేశారు..’’ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ గోల్నాక డివిజన్ లోని  కంఘర్ లో బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారాన్ని ఆయన  ప్రారంభించారు. రెండు పడక గదుల ఇళ్ల ఆశతో ప్రజలు మూకుమ్మడిగా తెరాసకు ఓటేస్తే ఒక్క ఇల్లు ఇవ్వలేదని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు. ఇల్లు ఎక్కడ కట్టారు, ఎవరికి ఇచ్చారో ప్రచారానికి వచ్చే నేతలను అడగాలని ఆయన సూచించారు. గత ఎన్నికల్లో బీజేపీ నాలుగు స్థానాలే గెలిచింది.. ఈ ఎన్నికల్లో బీజేపీ పై నగర ప్రజలు ఎంతో విశ్వాసంతో ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. బీజేపీ కి ప్రజలనుంచి విశేష ఆదరణ వస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారానికి వచిన్నప్పుడు స్థానిక సమస్యలపై నిలదీయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

for more News….

పాతబస్తీలో ఎంఐఎం కోటలు కదిలేనా?

ఖాళీ కుర్చీలతో ఎట్ల పనులైతయ్

గ్రేటర్ ఫలితం తేల్చేది.. ముంపు బాధితులే

సోషల్ మీడియాలో ప్రచారానికి స్పెషల్​ ఏజెంట్లు

కరోనా టీకా ట్రాన్స్ పోర్ట్ కు విమానాలు రెడీ

V6 న్యూస్ ఛానెల్ పై దుష్ప్రచారం.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు 

మనోళ్లపై ‘స్పుత్నిక్-V’ ట్రయల్స్.. మూడ్రోజుల్లో స్టార్ట్

ఆక్స్‌‌ఫర్డ్‌‌ వ్యాక్సిన్​ కోసం పేద దేశాలు వెయిటింగ్​