అధికారులు సహకరిస్తలేరని బీఆర్ఎస్ సర్పంచ్ నిరసన

నల్గొండ జిల్లా : నల్గొండ జిల్లా కేతపల్లి మండలం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశం రసాభాసగా ముగిసింది. కేతపల్లి ఎమ్మార్వో, ఎంపీడీవో వైఖరిని నిరసిస్తూ అధికార పార్టీ సర్పంచ్ నిరసనకు దిగాడు. చీకటి గూడెం బీఆర్ఎస్ సర్పంచ్ కోట వెంకటేశ్వరరావు చొక్కా విప్పి బైఠాయించారు. 

చీకటిగూడెం గ్రామాభివృద్ధికి ఎమ్మార్వో వెంకటేశ్వరరావు, ఎంపీడీవో రమేష్  దీన్ దాయల్  సహకరించడం లేదని సర్పంచ్ కోట వెంకటేశ్వరరావు ఆరోపించారు. అందుకే గత్యంతరం లేని పరిస్థితుల్లో అర్థనగ్నంగా నిరసన చేపట్టాల్సి వచ్చిందని అన్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు.