19ఏళ్ల లేడీడాన్‌ ఏం చేసిందో చూస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే.. (వీడియో)

19ఏళ్ల లేడీడాన్‌ ఏం చేసిందో చూస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే.. (వీడియో)

ఇరవైఆరేళ్ల అమన్ హత్య కేసులో ఓ లేడీ డాన్ ప్రమేయం ఉందని పోలీసులు ఆమెను శుక్రవారం అరెస్ట్ చేశారు. 2024 జూన్ సమయంలో ఢిల్లీ బర్గర్ కింగ్ అవుట్‌లెట్‌లోకి కొందరు వ్యక్తులు ప్రవేశించి అమన్ కాల్చి చంపారు. ఈ హత్యలో అను ధంకర్ అనే 19ఏళ్ల లేడీ డాన్ ప్రమేయం ఉందని పోలీసులు ఆమెను అక్టోబర్ 25న అరెస్ట్ చేశారు. ఇండియా బార్డర్ దాటి నేపాల్ పారిపోతుండగా అను ధంకర్ ఉత్తరప్రదేశ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. 

రాజౌరీ గార్డెన్‌లోని బర్గర్ కింగ్‌లో ఓ టేబుల్ పై అను ధంకర్ కూల్చోంది. అమన్ ఆ టేబుల్ వద్దకు వచ్చి కూర్చున్నాడు. తర్వాత కొంత మంది దుండగులు వచ్చి అమన్ ను కాల్చి చంపారు. అను ధంకర్ అమర్ ఫోన్, వ్యాలెట్ తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇదంతా ఆ హోటల్ సీసీపుటేజ్ లో రికార్డ్ అయ్యింది. దీని ఆధారంగా పోలీసులు ఈ హత్యతో అను ధంకర్ కు సంబంధం ఉందని తేల్చారు.

హర్యానాలో 2020లో జరిగిన హత్యకు ప్రతీకారంగా ఈ హత్య జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ హిమాన్షు భౌ, పోర్చుగల్‌లో నివసిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. గత కొన్ని నెలలుగా అను ధంకర్ పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతోంది. లేడీడాన్ పరారీలో ఉన్నప్పుడు ఆమె ఫ్రెండ్ భావు నుంచి ఆర్థిక సహాయం అందిందని పోలీసులు వెల్లడించారు. 

అక్టోబరు 22న నేపాల్ నుంచి దుబాయ్ వెళ్లి.. అక్కడి నుంచి అను ధంకర్ అమెరికా వెళ్లాలని ప్లాన్ చేసుకుంది. అను లఖింపూర్ ఖేరీ నుంచి నేపాల్‌కు వెళ్లాడానికి.. లక్నోకు వెళ్లింది. అక్కడ లేడీ డాన్ అను ధంకర్ ను ఢిల్లీ స్పెషల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె మీద క్రిమినల్ రికార్డ్ ఉందని.. గతంలో కూడా ఆమె కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు.