
- పోలీసులకు రియల్టర్ ఫిర్యాదు
- నిందితుడి అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు
భైంసా, వెలుగు : డబ్బులివ్వాలని రియల్టర్‌ను బ్లాక్మెయిల్చేసిన కౌన్సిలర్భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. భైంసా పట్టణానికి చెందిన రియల్టర్ కె.అరవింద్ గతంలో రాహుల్ నగర్లో కొంత భూమిని కొని, అందులో ప్లాట్లు వేశాడు. వాటిని అమ్మే క్రమంలో బీజేపీకి చెందిన 7వ వార్డు కౌన్సిలర్ అనిత భర్త బాలాజీ సుత్రావే.. అరవింద్‌ను బ్లాక్ మెయిల్ చేశాడు. వెంచర్ నిబంధనల ప్రకారం లేదని, ఎవరూ ప్లాట్లు కొనకుండా చేస్తానని బెదిరించాడు.
సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో కంప్లైంట్ ఇచ్చి రిజిస్ట్రేషన్ జరగకుండా చేశాడని, తమకు పర్సంటేజ్ ఇవ్వాలని బ్లాక్ మెయిల్‌కు పాల్పడి రూ.20 లక్షలు డిమాండ్ చేశాడు. చివరకు రూ.10 లక్షలు ఇచ్చాడు. ప్రస్తుతం నేతాజీ నగర్లో బాధితుడు అరవింద్ ఓ ల్యాండ్ కొని డెవలప్ చేసే క్రమంలో మళ్లీ బాలాజీ బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డాడు. చంపుతానని, ప్లాట్ లను కబ్జా చేస్తానని బెదిరించాడు.
బాలాజీ సూత్రావే బెదిరింపులకు సంబంధించిన కాల్స్‌ను అరవింద్ తన ఫోన్లో రికార్డు చేసి వాటిని పోలీసులకు సమర్పించాడు. వాటి ఆధారంగా పోలీసులు బాలాజీపై 386 ,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా అతడికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.