కరీంనగర్: ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని దీక్ష చేపట్టిన బండి సంజయ్ ను అరెస్ట్ చేయడం మంచిది కాదని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. సీఎం ఆదేశాలతోనే పోలీసులు నీచంగా ప్రవర్తించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ కమిషనర్ చివరికి కానిస్టేబుల్ లా ప్రవర్తించారని ఆయన అన్నారు. జైలులో ఉన్న బండి సంజయ్ ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామితో కలిసి పరామర్శించారు. అనంతరం మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు.
బండి సంజయ్ ను అరెస్ట్ చేయడం అత్యంత హేయమైన, నీచమైన చర్య. ఈ అరెస్ట్ ను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యే విధంగా ఉంది. ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీలు గందరగోళంగా ఉన్నాయి. ప్రభుత్వ అనాలోచిత బదిలీల వల్ల భర్త ఓ దగ్గర, భార్య మరో దగ్గర, పిల్లలు ఇంకో దగ్గర ఉండాల్సి వస్తోంది. దీని వల్ల కుటుంబాలు చెల్లాచెదురు అయ్యాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజా సమస్యల పట్ల బాధ్యతతో బండి సంజయ్ కోవిడ్ నిబంధనల మేరకు దీక్ష చేపట్టారు. అయినా అనుమతులు లేవని ఆయనను అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతోనే పోలీసులు నీచంగా ప్రవర్తించారు. కానిస్టేబుల్ నుంచి సీపీ వరకూ అన్ని విధులు సీపీనే చేశారు. ఇది రాజరిక వ్యవస్థ కాదు. ఇలా ప్రవర్తించడం మంచిది కాదు. మమ్మల్ని ఇబ్బంది పెడితే పెట్టారు.. కానీ ఉద్యోగ ఉపాధ్యాయులకు అన్యాయం చేయకండి. మేం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాం’ అని ఈటల అన్నారు.
https://www.youtube.com/watch?v=WFQVLI-3C1Q
For More News..
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్
రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ నేతల మౌనదీక్ష..