రాష్ట్రవ్యాప్తంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ హడావుడి స్టార్ట్ అయ్యింది. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ సంబరాల్లో మునిగిపోయారు. హైదరాబాద్ లో న్యూ ఇయర్ జోష్ తో యువత కేరింతలు కొడుతూ డ్యాన్స్ చేస్తున్నారు. ట్యాంక్ బండ్ పైకి వాహన రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా కేక్ కటింగ్ చేసి..ట్యాంక్ బండ్ మీదికి ఎంజాయ్ చేయడానికి వచ్చిన వారిని తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. హిమాయత్ నగర్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ పరిసరాల్లోని రోడ్డు మీద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నగరంలోని అన్ని ఫ్లైఓవర్లను క్లోజ్ చేశారు. ఎక్కడిక్కడే డ్రంకన్ డ్రైవ్ టెస్ట్ లు చేస్తున్నారు పోలీసులు. రూల్స్ బ్రేక్ చేయొద్దని వార్నింగ్ ఇస్తున్నారు. తాగి బండి నడిపితే భారీ జరిమానాలు విధిస్తున్నారు.
మరోవైపు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు. తాగి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.