అన్నపురెడ్డిపల్లి , వెలుగు : అక్రమంగా తరలిస్తున్న 80 క్విటాల రేషన్ బియ్యాన్ని ఆదివారం తెల్లవారు జామున ఎస్సై షాహిన , సిబ్బంది తో కలిసి పట్టుకున్నారు . ఎస్సై తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి . కొత్తగూడెం వైపు నుంచి కాకినాడ కు రెండు టాటా మ్యాజిక్ వెహికల్స్‌లో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారనే సమాచారం అందింది.
దీంతో మండలంలోని బుచ్చన్నగూడెం సమీపంలో వాహనాలను పట్టుకొని, వాటిని సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు . ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి , దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు . ఈ దాడిలో హెడ్ కానిస్టేబుల్ రామారావు , జీవన్ పాల్గొన్నారు.