- ఫైల్ చేయాలని పోలీసులకు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆదేశం
- పోటులోకి పోలీసులు రాకుండా అడ్డుకున్న దేవస్థానం స్టాఫ్
- తీవ్ర ఉద్రిక్తత.. విచారణకు ఆదేశించిన ఎండోమెంట్ కమిషనర్
భద్రాచలం, వెలుగు: భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ప్రసాదాల వివాదంపై స్థానిక ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్సుమోటో కింద కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. టెంపుల్కౌంటర్లలో బూజు పట్టిన లడ్డూలు విక్రయిస్తున్నారంటూ ఆదివారం భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సోమవారం మెజిస్ట్రేట్ ఆదేశంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రసాదాల తయారీ పోటు పరిశీలన, కౌంటర్ల సీజ్‌కు ప్రయత్నించగా దేవస్థానం వైదిక కమిటీ, ఉద్యోగులు అడ్డుకున్నారు. వారికి టీఎన్జీవోలు కూడా మద్దతివ్వడంతో ఉద్రిక్తత నెలకొంది. నిష్టతో దేవుడికి ప్రసాదాలు తయారు చేసే పోటులోకి ఆలయ ఉద్యోగులకు కూడా ప్రవేశం ఉండదని, బూట్లు ధరించి ఎలా వెళ్తారని ప్రశ్నించారు.
ఈవోకు సమాచారం ఇవ్వకుండా ఎలా తనిఖీ చేస్తారని నిలదీశారు. ప్రసాదాల తయారీలో నాణ్యతపై ఇటీవల ఫుడ్స్ ఇన్ స్పెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన ట్రైనింగ్, సర్టిఫికెట్లను చూపించారు. చివరికి ఆర్డీవో రత్నవల్లి, ఫుడ్ఇన్ స్పెక్టర్ వేణుగోపాల్ఆలయానికి చేరుకున్నారు. నోటీసులు ఇవ్వకుండా తనిఖీకి ఎలా వస్తారని ఆర్డీవో సైతం పోలీసుల తీరును తప్పుబట్టారు. పోలీసులు గో బ్యాక్ అంటూ ఉద్యోగులు ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు వెనక్కు తగ్గారు. కాగా, లడ్డూలను ల్యాబ్‌కు పంపించి టెస్ట్ చేయించాలని ఆర్డీవో.. ఫుడ్ఇన్ స్పెక్టర్ ను ఆదేశించారు. అలాగే, ఎండోమెంట్ కమిషనర్ అనిల్కుమార్ఘటనపై విచారణకు ఆదేశించారు. అడిషనల్ కమిషనర్, ఆర్డీవో, ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ డిప్యూటీ కలెక్టర్లతో కూడిన త్రీ మెంబర్ కమిటీని ఏర్పాటు చేశారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.