కేసీఆర్ గెటప్ లో బాలుడు..ఎస్కార్ట్ ఇచ్చిన పోలీసులు

సూర్యాపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో సీఎం కేసీఆర్ వేషధారణలో వచ్చిన ఓ బాలుడికి పోలీసులు ఎస్కార్ట్ వాహనం ఇచ్చారు. చిల్డ్రన్స్ డే వేడుకల సందర్భంగా పిల్లలు ఒక్కోక్కరూ ఒక్కొక్క వేషధారణలో పాఠశాలకు వచ్చారు. అయితే ఓ బాలుడు మాత్రం ఏకంగా సీఎం కేసీఆర్ వేషధారణలో ప్రత్యక్షమయ్యాడు. అచ్చం కేసీఆర్ ధరించినట్లే తెల్ల పంచె కట్టుకుని.. నెత్తి పై టోపీ పెట్టుకుని కనిపించాడు. తన వేషధారణతో అందరిని ఆకట్టుకున్నాడు. 

విషయం తెలుసుకున్న పోలీసులు స్వయంగా ఎస్కార్ట్ వాహనంలో బాలుడిని స్కూల్ వద్ద దింపారు. ఇది చూసిన టీచర్లు బాలుడిని అభినందించారు. అతడి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. తోటి విద్యార్థులు కేసీఆర్ వేషధారణలో ఉన్న బాలుడిని చూసి ఆశ్చర్యపోయారు.