హైదరాబాద్ అత్తాపూర్ లో ల్యాండ్ కబ్జా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్బర్ హిల్స్ లో రూ. కోట్ల విలువ చేసే 500 గజాల స్థలాన్ని కబ్జా చేసి యజమానిని బెదిరించడంతో పోలీసులు రంగంలోకి దిగి తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి నకిలీ డాక్యుమెంట్లు, కత్తులు, తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.
కబ్జా ల్యాండ్ లో బోనులో కుక్కలను బంధించారు. ఎవరైనా లోపలికి వస్తే వారిపై కుక్కలను వదులుతున్నారని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.. కొద్ది రోజుల క్రితం ఎమ్మార్పీఎస్ నాయకుడి కిడ్నాప్ కేసులో వీరి పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ల్యాండ్ ఎవరిది అనే కోణంలో పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. కబ్జాకు గురైన ల్యాండ్ యజమానులు ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.