హైదరాబాద్ : నాచారంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని సన ఆత్మహత్య కేసులో అత్త మామలను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో సన అత్తమామలను నాచారం పోలీసులు అరెస్ట్ చేశారు. 2023, జూన్ 20వ తేదీన సెల్ఫీ వీడియో తీసుకుని సన ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తమ అల్లుడు వివాహేతర సంబంధాలే తమ కూతురు సన మృతికి కారణమని ఆమె తల్లిదండ్రులు మీడియాకు తెలిపారు. సన అత్త మమాలను జులై 3వ తేదీన కోర్టులో ప్రవేశపెట్టనున్నారు నాచారం పోలీసులు.
హేమంత్ అనే వ్యక్తిని సన ప్రేమించి పెళ్లి చేసుకుంది. మొదట్లో వీరి కాపురం సజావుగానే సాగింది. కొన్నాళ్ల తర్వాత తనను అత్తమామలు తరచూ వేధిస్తున్నారని, ఇటు భర్త హేమంత్ సైతం మరో అమ్మాయికి దగ్గరయ్యాడని సనా ఆత్మహత్యకు ముందు ఆరోపించింది. ఫేస్‌బుక్ లైవ్ పెట్టి మరీ ఉరేసుకుని చనిపోయింది. సనాకు మూడేళ్ల కుమారుడు ఉన్నాడు.