కేపీహెచ్బీలో హత్యకు గురైన మహిళ గుర్తింపు

కేపీహెచ్బీలో హత్యకు గురైన మహిళ గుర్తింపు
  • నిజామాబాద్​వాసిగా తేల్చిన పోలీసులు   
  • ఓ వ్యక్తి తీసుకెళ్లి చంపాడని అనుమానాలు

కూకట్పల్లి, వెలుగు : కేపీహెచ్బీ కాలనీ రోడ్​నం.1లోని ఉదాసీన్​ మఠ్కి చెందిన నిర్మానుష్య ప్రాంతంలో బుధవారం దొరికిన మహిళ డెడ్​బాడీని పోలీసులు గుర్తించారు. నిజామాబాద్​ జిల్లా బోధన్​ మండలం ఆమ్రాబాద్కు చెందిన ప్రియాంక(30)గా తేల్చారు. ఆమెకు పెండ్లయి ఒక కూతురు కూడా ఉంది. కొంత కాలం క్రితం భర్తతో విడిపోగా, బిడ్డను వదిలి రెండు నెలల క్రితం నగరానికి వచ్చింది. తెలిసిన వారు ఎవరూ లేకపోవడం, ఉండడానికి ఏ చోటూ లేక రాత్రిళ్లు  కేపీహెచ్బీ కాలనీ మెట్రో స్టేషన్​ఫుట్​పాత్పై పడుకుంటోంది. 

ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆమెను ఉదాసీన్​మఠ్​ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లినట్టు సమాచారం. అప్పుడే హత్య చేసినట్టు అనుమానిస్తుండగా, నాలుగు రోజుల తర్వాత ఆమె డెడ్​బాడీని స్థానికులు గుర్తించారు. సంఘటన స్థలంలో పోలీసులు కండోమ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈమెను తీసుకువెళ్లిన వ్యక్తి హత్య చేయడానికి కారణం ఏమిటనేది మాత్రం తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని హత్యకు పాల్పడిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.