హైదరాబాద్‌లో రాజాసింగ్ ర్యాలీకి.. ఏర్పాట్లు ఇవే

హైదరాబాద్‌లో రాజాసింగ్ ర్యాలీకి.. ఏర్పాట్లు ఇవే

హైదరాబాద్: నగరం బుధవారం  రామనామంతో పులకించనుంది. సెంట్రల్ అట్రాక్షన్ అంతా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ నిర్వహించే ర్యాలీ మీదే ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా శ్రీరామ నవమి రోజు జరిగే ఈ శోభయాత్ర చాలా ఫేమస్.  రైట్‌వింగ్ హిందూ సంఘాలు సీతారాం బాగ్ నుండి కోటి వ్యాయామశాల వరకు ఏడు కి.మీ మేరా ఈ ర్యాలీ నిర్వహిస్తాయి. శోభాయాత్ర కొనసాగే ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.  ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసుల సూచిస్తున్నారు. శోభయాత్ర జరిగే రూట్లలో  25 సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

టాస్క్ ఫోర్స్ పోలీస్ తో పాటు రాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఆక్టోపస్ పోలీసుల భద్రతతో హైదరాబాద్ లో సెక్యూరిటీ టైట్ ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేసిన పోలీసులు.  సీతారాంబాగ్ నుండి ర్యాలీ ప్రారంభమై బోయ గోడ కమాన్, దూల్పేట్ మీదుగా జాలి హనుమాన్, పురానాపూల్, జుమేరిత్ బజార్, బేగం బజార్ మీదుగా కోటి వ్యాయామశాల వరకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.11 నిమిషాలకు ర్యాలీ ప్రారంభమైతుంది. లక్షమంది భక్తులకు ఈ శోభయాత్రలో భాగస్వాయం చేయాలనే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా రామాలయాలు, వైష్ణవాలయాలు ప్రత్యేకంగా ముస్తాబయ్యాయి. రథాల ఊరేగింపు చేసి రాముడి కల్యాణం, పట్టాభికాన్ని కన్నులపండువగా నిర్వహించనున్నారు. 


,