పరారీలో హోంగార్డు

నిర్మల్, వెలుగు : పరారీలో ఉన్న ట్రాఫిక్ హోంగార్డు షమీ ఉల్లా ఖాన్ అలియాస్ షకీల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్మల్ టౌన్ ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న షకీల్ తనకున్న పరిచయాలను అడ్డుపెట్టుకొని పలువురిని బెదిరించడమే కాకుండా మోసాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.

సిమెంటు, ఇసుక, ఇటుక, స్టీల్ ను తక్కువ ధరకే ఇప్పిస్తానని రూ.లక్షలు తీసుకున్నట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ  జరిపిన పోలీసు ఉన్నతాధికారులు హోంగార్డు కోసం గాలించారు. పరారీలో ఉండడంతో శుక్రవారం కేసు నమోదు చేశారు.