
అల్లాదుర్గం, వెలుగు : బెల్టు షాపుపై దాడిచేసి అక్రమంగా విక్రయిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం మండల కేంద్రమైన అల్లాదుర్గంలో ఓ షాప్లో మద్యం అమ్ముతున్నట్టు తెలిసి సీఐ రేణుక
ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి దాడి చేసి అక్రమంగా నిల్వ ఉంచిన 36 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నారు. మద్యం విక్రయిస్తున్న ప్రతాప్ గౌడ్ (చందు గౌడ్) పై కేసు నమోదు చేసి పీఎస్ తరలించారు.