4 గంటలుగా మూలవాగులో చిక్కుకున్న కూలీ.. పోలీసులు ఎలా కాపాడారంటే..?

రాజన్న సిరిసిల్ల జిల్లా : వేములవాడ మూలవాగులో చిక్కుకున్న ఓ కూలీని అతికష్టం మీద రక్షించారు పోలీసులు. నాలుగు గంటలుగా మూలవాగు మధ్యలోని చెట్టును పట్టుకొని ఉన్న వ్యక్తిని కాపాడారు. బుగ్గారం గ్రామానికి చెందిన మారుతీ అనే వ్యక్తి.. ప్రమాదవశాత్తు మూలవాగులో జారిపడ్డాడు. దీంతో అతడిని రక్షించేందుకు స్థానికులు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ.. సాధ్యం కాలేదు. 

చివరకు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలియగానే పోలీసులు వెంటనే తాళ్ల తీసుకుని.. ఘటనాస్థలానికి చేరుకున్నారు. మూలవాగు మధ్యలోని ఓ చెట్టును పట్టుకుని ఉన్న మారుతీని అతికష్టం మీద రక్షించి.. ప్రాణం కాపాడారు. వేములవాడ పట్టణ సీఐ కర్ణాకర్ తన సిబ్బందితో తాళ్ల సహాయంతో మారుతీని రక్షించారు. పోలీసుల చేసిన కృషిని అందరూ అభినందించారు.