హార్డ్ డిస్క్ లో ప్రైవేట్ వీడియోలు... లావణ్యను చంపేందుకు మస్తాన్ సాయి ప్లాన్..

హార్డ్ డిస్క్ లో ప్రైవేట్ వీడియోలు... లావణ్యను చంపేందుకు మస్తాన్ సాయి ప్లాన్..

లావణ్య కేసులో మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు బయట పడ్డాయి. అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు ఉన్న హార్డ్ డిస్క్ కోసం లావణ్యను చంపేందుకు మస్తాన్ సాయి ప్లాన్ చేశాడని పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో తెలిపారు. జనవరి 30 న లావణ్య ఇంటికెళ్లి హత్యాయత్నం చేసినట్లు వెల్లడించారు.  డ్రగ్స్ టెస్ట్ లో మస్తాన్ సాయికి పాజిటివ్ వచ్చిందని చెప్పారు.  న్యూడ్ వీడియోల కేసులో మస్తాన్ సాయితో పాటు అరెస్టు అయిన కాజాకు కూడా డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిందన్నారు.. ఇద్దరిపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు 

Also Read : చిక్కులు తెచ్చిన డేటింగ్ యాప్‌

లావణ్యవి 40 ప్రైవేట్ వీడియోలు

 అమ్మాయిలతో పరిచయం పెంచుకోవడం..సన్నిహితంగా ఉండడం..వారికి తెలియకుండా వీడియోలు రికార్డ్ చేయడం..వారిని బ్లాక్ మెయిల్ చేయడం.. అత్యాచారం చేయడం ఇదే మస్తాన్ సాయి అసలు భాగోతం.  మనోడు 200లకు పైగా ప్రైవేట్ వీడియోలను సేకరించి పెట్టుకున్నాడు. ఏకంగా దీని కోసం ఒక హార్డ్ డిస్క్ నే పెట్టుకున్నాడు.  ఈ హార్డ్ డిస్క్ ను లావణ్య పోలీసులకు ఇచ్చిన సంగతి తెలిసిందే.. పోలీసులు స్వాధీనం చేసుకున్న  ఈ హార్డ్ డిస్క్ లో చాలా మంది సినీ ప్రముఖుల ప్రైవేట్ వీడియోలను,డ్రగ్స్ సేవిస్తూ ఉన్న వీడియోలను మస్తాన్ సాయి రికార్డ్ చేశాడు. ఓ పార్టీలో  లావణ్యకు డ్రగ్స్‌ ఇచ్చిన వీడియోలు కూడా మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో ఉన్నాయి. మస్తాన్ సాయి నిఖిల్ ఫోన్ కూడా హ్యాక్ చేశాడు. 100కు పైగా పలువురి వీడియోలు రికార్డ్ చేశాడు మస్తాన్ సాయి. లావణ్యకు చెందిన 40 ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేశాడు మస్తాన్ సాయి.