సూసైడ్​ చేసుకోబోయిన మహిళను కాపాడిన బాలానగర్ పోలీసులు

కూకట్​పల్లి, వెలుగు: సూసైడ్ ​చేసుకోవడానికి రైలు పట్టాలపై కూర్చున్న మహిళను పోలీసులు కాపాడారు. బాలానగర్​పరిధిలోని రాజుకాలనీలో ఉండే మంగమ్మ(45) కుటుంబ కలహాలతో విసిగిపోయింది. మంగళవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిన ఆమె సూసైడ్​ చేసుకోవడానికి ఫిరోజ్​గూడ ఎంఎంటీఎస్​ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై కూర్చుంది. 

సమాచారం తెలుసుకున్న కానిస్టేబుల్స్​ రవీందర్, సుధాకర్​రెడ్డి అక్కడికి చేరుకున్నరు. పట్టాలపై కూర్చున్న మంగమ్మను పక్కకు తీసుకువెళ్లి  నచ్చజెప్పారు. మరోసారి ఆత్మహత్యాప్రయత్నం చేయవద్దని కౌన్సిలింగ్​ ఇచ్చి కుటుంబ 
సభ్యులకు అప్పగించారు.