జయశంకర్ భూపాలపల్లి జిల్లా : తాడిచర్లలోని ఓపెన్ కాస్ట్ ను సందర్శించడానికి వెళ్లిన తీన్మార్ మల్లన్నను పోలీసులు అడ్డుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహర్ రావు మండలం తాడిచెర్లలోని ఓపెన్ కాస్ట్ ను సందర్శించడానికి తీన్మార్ మల్లన్న, ఆయన సహచరులు, టీమ్ సభ్యులు వెళ్లారు. ఓపెన్ కాస్ట్ లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, తీన్మార్ మల్లన్నకు మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది.
ఓపెన్ కాస్ట్ లోకి వెళ్లనివ్వకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎంతమంది పోలీసు బలగాలు వచ్చినా ఎన్ని అడ్డంకులు ఎదురైనా తాడిచర్ల ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిని సందర్శించి తీరుతామని తీన్మార్ మల్లన్న చెప్పారు. అనంతరం తాడిచర్ల గ్రామంలోకి పాదయాత్రగా బయలుదేరారు. మార్గమధ్యలో వరి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.