
మూగ జీవుల అక్రమ రవాణా రోజు రోజుకీ పెరిగిపోతోంది. ములుగు జిల్లాలో అలాంటి ఘటనే మళ్లీ జరిగింది. జిల్లాలోని జంగాల్పల్లి చెక్పోస్ట్వద్ద పోలీసులు జూన్ 26న వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో కంటైనర్లో అక్రమంగా 70 గోవులను తరలిస్తున్న కంటైనర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పశువులను తరలిస్తున్న ఇద్దరి వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
పశువులను రామప్ప సమీపంలోని గోశాలకు తరలించారు. పశువుల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.