నల్గొండ/యాదాద్రి, వెలుగు : నల్గొండ పార్లమెంట్ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 2019 ఎంపీ ఎ న్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్పర్సంటేజీ తగ్గింది. ఏడు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 72 శాతం ఓట్లు పోలయ్యాయి. 2019 ఎన్నికల్లో 74.15 శాతం పోలింగ్‌నమోదైంది. ఈ ఎన్నికల్లో నల్గొండ, భువనగిరిలో స్థానాల్లో మూడు ప్రధాన పార్టీల మధ్య ట్రయాంగిల్ వార్జరిగింది. పోలింగ్తీరును పరిశీలిస్తే బీఆర్ఎస్ఓట్లు చీలినట్టుగా భావిస్తున్నారు. రూరల్, అర్బన్ ఏరియాల్లో పోలింగ్ రికార్డు స్థాయిలోనే నమోదైంది.
మొరాయించిన ఈవీఎంలు...
కోదాడ నియోజకవర్గంలోని మునగాల మండలం 74వ పోలింగ్ కేంద్రంలో మాక్ పోలింగ్‌పూర్తయ్యాక, ఈవీఎం మొరాయించింది. ఆ తరువాత సరిచేయడంతో పోలింగ్ కొనసాగింది. అదే మండలంలోని 81వ పోలింగ్‌బూత్‌లో కూడా ఈవీఎం మొరాయించడంతో కాసేపు పోలింగ్‌ఆగిపోయింది. సాగర్ నియోజకవర్గంలోని హాలియాలో 162వ పోలింగ్‌స్టేషన్, పెద్దవూరలోని 81వ పోలింగ్‌స్టేషన్ ఈవీఎంలు మోరాయించాయి. నిడమనూరు మండలం బంకాపురంలో ఈవీఎం సమస్యతో పోలింగ్‌అర గంటపాటు ఆలస్యమైంది. దేవరకొండ నియోజకవర్గంలోని చింతపల్లి మండలం కురుమేడులోని 11వ బూత్‌లో వీవీ ప్యాట్‌పని చేయకపోవడంతో దానిని మార్చారు.
హుజూర్‌నగర్‌నియోజకవర్గంలోని చింతలపాలెం మండలం వజినేపల్లి ఈవీఎం మొరాయించడంతో కొద్దిసేపు పోలింగ్ ఆగిపోయింది. డిండి మండల పరిధిలోని దేవత్ పల్లి తండాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పోలింగ్బూత్ఆవరణలో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ మహిళకు గాయం కావడంతో ఆస్పత్రికి తరలించారు. సూర్యాపేట మండల పరిధిలోని పిల్లలమర్రి పోలింగ్ స్టేషన్ 21లో ఈవీఎం కాసేపు మోరాయించడంతో అధికారులకు సమాచారం ఇవ్వగా టెక్నికల్ సిబ్బంది వచ్చి సరి చేశారు.
అదేవిధంగా పెన్ పహాడ్ మండలంలోని జలమాలకుంట తండా పోలింగ్ స్టేషన్లో వీవీ ప్యాట్ పనిచేయకపోవడంతో దాని స్థానంలో మరో వీవీ పాట్ఏర్పాటు చేయడంతో పోలింగ్ సజావుగా సాగింది. మిర్యాలగూడ మండలం జైత్య తండాలో ఈవీఎం నిర్వహణపై అవగాహన లేకపోవడంతో పోలింగ్ నిర్వహించలేకపోయారు. సుమారు అరగంటపాటు పోలింగ్ ప్రక్రియ నిలిచింది. సమాచారం అందుకున్న సెక్టోరియల్ అధికారి వచ్చి సరిచేయడంతో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
యాదాద్రి, వెలుగు : భువనగిరి లోక్‌సభ స్థానంలో చిన్న చిన్న సంఘటనలు మినహా పోలింగ్ప్రశాంతంగా జరిగింది. పోలింగ్ ప్రారంభమైన వెంటనే వలిగొండ, రెడ్డి నాయక్ తండా, గౌస్ నగర్, లింగోజీగూడెంలోని పోలింగ్సెంటర్లలో ఈవీఎంలు మొరాయించాయి. భువనగిరిలోని పోలింగ్సెంటర్లో వీవీప్యాట్ఎర్రర్ చూపింది. దీంతో కొద్దిసేపు పోలింగ్నిలిచిపోయింది. అనంతరం వాటిని రీప్లేస్ చేసి పోలింగ్ కొనసాగించారు. ఓట్లు వేయడానికి ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్సెంటర్లకు తరలివచ్చారు. యువతతో పాటు వృద్ధులు, దివ్యాంగులు పోలింగ్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
కొందరు మహిళలు చంటి పిల్లలను తీసుకొని ఓట్లు వేయడానికి వచ్చారు. కొన్ని చోట్ల పోలింగ్‌బూత్‌లకు సెల్ ఫోన్లను పోలీసులు అనుమతించలేదు. దీంతో ఓటర్లు వారితో వాగ్వాదానికి దిగారు. భువనగిరి లోక్‌సభ స్థానంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు సహా మొత్తం 39 మంది పోటీలో ఉండడంతో మూడు ఈవీఎంలు ఏర్పాటు చేశారు.
నల్గొండ లోక్‌సభలో పోలైన ఓట్లు (సాయంత్రం 5 గంటలకు..)
నియోజకవర్గం పోలైన శాతం
నల్గొండ 68.21
దేవరకొండ 68.31
నాగార్జున సాగర్ 71.6
మిర్యాలగూడ 70.25
హుజూర్ నగర్ 72.96
కోదాడ 72.4
సూర్యాపేట 68.95
భువనగిరి లోక్‌సభలో పోలైన ఓట్లు
నియోజకవర్గం పోలైన శాతం
ఇబ్రహీంపట్నం 63.13
మునుగోడు 79.57
భువనగిరి 74.24
నకిరేకల్ 72.34
తుంగతుర్తి 71.3
ఆలేరు 79.12
జనగాం 70.25