కామారెడ్డిటౌన్, వెలుగు : జిల్లాలో పోలింగ్ శాతం 80 ఉంటే టౌన్ ఏరియాల్లో మాత్రం 60 శాతం మాత్రమే పోలింగ్ నమోదవుతుందని కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్అన్నారు. స్వీప్ ప్రొగ్రాంలో భాగంగా గురువారం కామారెడ్డి మున్సిపల్ఆఫీసులో మహిళ సమాఖ్య ప్రతినిధులతో మీటింగ్నిర్వహించారు. కలెక్టర్మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో 1,547 మహిళ సమాఖ్యలు ఉండగా16 వేల మంది సభ్యులు ఉన్నారన్నారు.
వీరితో మీటింగ్‌లు నిర్వహించి ఓటు హక్కు ప్రాధాన్యత గురించి వివరించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలన్నారు. ప్రతి అభ్యర్థి వివరాలు ఎన్నికల సంఘం పారదర్శకంగా తమ వెబ్ సైట్లో ఉంచుతుందన్నారు. మే 13 హాలిడే కాదన్నారు. స్వీప్ నోడల్ ఆఫీసర్ వెంకటేశం, మున్సిపల్ కమిషనర్ సుజాత, మెప్మా పీడీ శ్రీధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
అఫ్లికేషన్ల వెరిఫికేషన్ స్పీడప్ చేయాలి
ఓటరు నమోదు అప్లికేషన్ల వెరిఫికేషన్‌ను స్పీడప్ చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆఫీసర్లకు ఆదేశించారు. మండల స్థాయి ఆఫీసర్లతో గురువారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దనే ఓటు వేసే ఏర్పాట్లు చేయాలన్నారు.
పోలింగ్ కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్లు చంద్రమోహన్, శ్రీనివాస్‌రెడ్డి, ఏవో మసూర్ ఆహ్మాద్, ఆఫీసర్లు సరళ ,జ్యోతి, ఉమాలత, స్వప్న, ఇందిరా, ప్రియదర్శని, అనిల్‌కుమార్‌లు పాల్గొన్నారు.