చెరువు నిండా చేపలు.., ఒక్కోటి 2 నుంచి 10 కిలోలు ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం ఎడ్లపల్లిలోని ఊర చెరువులో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బుధ, గురువారాల్లో చేపలు పట్టారు. రెండు రోజుల చేపల వేటలో 8 టన్నుల పైనే చేపలు లభ్యమయ్యాయి.
ఇంకా 4 టన్నుల చేపలు ఉన్నాయని, ఈ చెరువులో ఇంత పెద్ద మొత్తంలో చేపలు దొరకడం ఇదే మొదటిసారని గ్రామస్తులు చెబుతున్నారు.- మల్హర్, వెలుగు