
భద్రాచలం,వెలుగు : భద్రాచలంలోని మనుబోతుల చెరువులో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద ఆదివారం పేదలు ధర్నా నిర్వహించారు. గతంలో ఈ ప్రాంతంలో గుడిసెలు నిర్మించుకున్నామని, కానీ.. తమకు ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని ఖాళీ చేయించిందని వాపోయారు.
దీంతో, తాము ఇండ్లు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. డబ్బులిస్తేనే డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇప్పిస్తామంటూ దళారులు తమ చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. అలవాల రాజా, కొప్పు రాంబాబు, తెల్లం సమ్మక్క, మేకల లత, కుమారి, నాగమణి, సుహాసిని పాల్గొన్నారు.