
ములుగు: పేదలకు కడుపునిండా తిండి పెట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సీతక్క అన్నారు. బుధవారం (ఏప్రిల్ 2) ములుగు జిల్లాలోని గోవింద రావు పేట, మల్లంపల్లి, తాడ్వాయి మండలాల్లో పేదలకు సన్నబియ్యం పంపిణీ చేశారు మంత్రి సీతక్క. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇక అన్నమో రామచంద్ర అనే కాలం పోయిందని.. పేదలకు కడుపునిండా తిండి పెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. దేశంలోనే రేషన్ ద్వారా సన్నబియ్యం పథకం అమలు చేయడం చారిత్రాత్మకమని అన్నారు.
ALSO READ బియ్యం కయ్యం!.. క్రెడిట్ వేటలో కమలం పార్టీ..మోదీ ఫొటో పెట్టాలని కిరికిరి
పేదలు సన్న బియ్యం పథకం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హులైన పేదలకు త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు అందిస్తామని తెలిపారు. ఆహార భద్రత చట్టం తెచ్చిన ఘనత మా ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని తెలిపారు. త్వరలోనే మిగిలిన హామీలను అమలు చేస్తామని అన్నారు.