
సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని పోస్టాఫీస్ ప్రతిరోజు మూసే ఉంటుంది. వచ్చిన లెటర్లు, పార్సల్స్ను ఎవరూ పంపిణీ చేయకపోవడంతో నెలల తరబడి పెండింగ్‌లో నే ఉంటున్నాయి. మర్కుక్మండలంలోని చేబర్తి బ్రాంచ్పోస్ట్మాస్టర్కేతవత్ సంతోష్‌కు ఈ బ్రాంచ్ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. అతడు వారంలో ఒకటి రెండు సార్లు సాయంత్రం తర్వాత పోస్టాఫీస్ తెరిచి కొద్దిసేపు వృద్ధులకు పెన్షన్లు ఇచ్చి వెళ్లిపోతున్నాడు.
దీంతో అతడి రాకకోసం పెన్షన్‌దారులు రోజుల తరబడి ఎదురుచూడక తప్పడంలేదు. ఇప్పటికైనా ఈ బ్రాంచ్‌లో పర్మినెంట్ సిబ్బందిని నియమించి సేవలు పునరుద్ధరించాలని స్థానికులు డిమాండ్చేస్తున్నారు. - ములుగు, వెలుగు