- చెడిపోయిన 319 ట్రాన్స్ ఫార్మర్లు.
- ముంపుకు గురైన నాలుగు సబ్ స్టేషన్లు
సూర్యాపేట, వెలుగు : భారీ వర్షం కారణంగా రాష్ట్రంలోనే అత్యధికంగా సూర్యాపేట జిల్లాలోని విద్యుత్ వ్యవస్థ నష్టపోయింది. బుధవారం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ చైర్మన్ ముషారఫ్ ఫరూఖీ కోదాడలో పర్యటించారు. వరద ప్రభావంతో దెబ్బతిన్న రామాపురం, ఎంబీ గూడెం సబ్ స్టేషన్లను, విద్యుత్ నెట్వర్క్ ను పరిశీలించారు. గాలుల ప్రభావంతో చెట్లు, కొమ్మలు విరిగి విద్యుత్ స్తంభాలపై పడటంతో 33 కేవీ పోల్స్15, 11 కేవీ పోల్స్1074, ఎల్టీ పోల్స్ 1038, 319 ట్రాన్స్ ఫార్మర్స్ దెబ్బతిన్నాయన్నారు.
దీనికి తోడు నాలుగు సబ్ స్టేషన్స్ వరద ముంపుకు గురయ్యాయని చెప్పారు. భారీ నష్టం జరిగినా.. యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సరఫరా పునరుద్ధరించడం కోసం తమ సిబ్బంది, అధికారులు అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. ఈ పర్యటనలో సీఎండీతో పాటు చీఫ్ ఇంజినీర్ రూరల్ జోన్ భిక్షపతి, సూపెరింటెండింగ్ ఇంజినీర్ ఫ్రాంక్లిన్, డివిజనల్ ఇంజినీర్లు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.