సికింద్రాబాద్, వెలుగు : ఇంట్లో గొడవ పడి సికింద్రాబాద్‌కు చేరుకున్న ఓ గర్భిణి రైల్వే ప్లాట్‌ఫామ్ మీదనే డెలివరీ అయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన అనూషకు ఓ పాప ఉండగా ప్రస్తుతం గర్భిణి. భర్తతో గొడవ పడిన అనూష గురువారం ఇంట్లో నుంచి బయటకు వచ్చి రైలు ఎక్కి సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకుంది. నిండు గర్భణి కావడంతో నడవలేక గురువారం రాత్రి ఆరవ నంబర్ ప్లాటఫామ్పైనే పడుకుంది.
శుక్రవారం తెల్లవారుజామున పురిటినొప్పులతో బాధ పడుతుండగా అక్కడే ఉన్న ప్రయాణికులు 108కు ఫోన్ చేశారు. అనూషను అంబులెన్స్‌లోకి ఎక్కిస్తుండగా నొప్పులు ఎక్కువ అయ్యాయి. దీంతో అంబులెన్స్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ వివేకవర్ధన్ స్థానిక ప్రయాణికులతో కలిసి అనూషకు అక్కడే పురుడు పోశారు. తర్వాత తల్లీబిడ్డలను హాస్పిటల్‌కు తరలించారు.