గత బీఆర్ఎస్​ ప్రభుత్వం కులాల మధ్య చిచ్చు పెట్టింది..బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేష్

గత బీఆర్ఎస్​ ప్రభుత్వం కులాల మధ్య చిచ్చు పెట్టింది..బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేష్

గత బీఆర్​ఎస్ ప్రభుత్వం కులాల మధ్య చిచ్చుపెట్టి , సహకార సంఘాలను విచ్చిన్నం చేసి... తమకు అనుకూలంగా ఉన్న వారికి లబ్ది చేకూర్చిందని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేష్ ఆరోపించారు.   కాంగ్రెస్ ప్రభుత్వం కులాల పేరుతో దళారి పనులు చేసే వారిని ప్రోత్సహించొద్దని  విజ్ఞప్తి చేశారు. కులాల మధ్య అంతరాలకు నిరసనగా ట్యాంక్ బండ్ జలదృశ్యం లోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద తెలంగాణ రాష్ట్ర పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన మౌనదీక్ష దాసు సురేష్ మద్దతు తెలిపారు. 

 పద్మశాలీ సంఘం అధ్యక్షుడు రాజ్ కుమార్ తో కలిసి దాసు సురేష్ మాట్లాడుతూ...  కులాలను సమన్వయం చేయాల్సిన పాలకులు కొన్ని సంఘాలను మాత్రమే నెత్తిన పెట్టుకోవడం సరైంది కాదన్నారు. దీనివల్ల కులానికి జరిగే ప్రయోజనం కంటే , వ్యక్తిగత ప్రయోజనాలే ఎక్కువ ఉంటాయన్నారు.ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి , అన్ని కులాలకు సముచిత స్థానం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పద్మశాలీ సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు.