బంగారం ధరతో మిర్చి పోటీ పడుతుంది. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధరలు భారీగా పెరిగాయి. ఇవాళ 25వేల మిర్చి బస్తాలను తీసుకొచ్చారు రైతులు. దేశీ ఏసీ రకం క్వింటాల్ మిర్చికి 52వేల ధర పలికింది. క్వింటాల్ కు 52వేలు పలకడం చరిత్రలో ఇదే తొలిసారని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. చపాతి దొడ్డు రకం క్వింటాల్ కు 40వేల ధర పలికింది. దేశీ మిర్చి రేట్ ఒకేసారి హైక్ కావటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మిర్చిరేటులో పాటు పత్తి ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. క్వింటాల్ పత్తి 11వేల 690 రూపాయలు పలికింది. నిన్న ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో పత్తి క్వింటాల్ ధర 12వేలు పలికింది. పత్తి రేట్లు రికార్డు స్థాయిలో పెరగడంతో రైతులు సంబరపడుతున్నారు.
ఇవి కూడా చదవండి
ఫ్యాట్ ఈజ్ క్యూట్ అంటూ ర్యాంప్ వ్యాక్
జైల్లో చదివిండు ఐఐటీ ర్యాంకర్ అయ్యిండు
ఈ ఆటో డ్రైవర్.. ఒకప్పుడు ఇంగ్లీష్ టీచర్