పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర

పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర

న్యూఢిల్లీ: డిమాండ్​బలహీనపడటంతో బుధవారం దేశ రాజధానిలో బంగారం ధరలు  రూ. లక్ష మార్కు నుంచి యూ–-టర్న్ తీసుకున్నాయి. పది గ్రాముల ధర  రూ.2,400 తగ్గి రూ.99,200కు చేరుకుంది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర మంగళవారం రూ.1,800 పెరిగి 10 గ్రాములకు రూ.1,01,600 జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకుంది. 99.5 ప్యూరిటీ గల బంగారం ధర బుధవారం రూ.3,400 తగ్గి రూ.98,700కి చేరుకుంది. స్థానిక మార్కెట్లలో 10 గ్రాముల బంగారం ధర మంగళవారం రూ.2,800 పెరిగి ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి రూ.1,02,100కి చేరుకుంది.  బుధవారం వెండి ధరలు కిలోకు రూ.700 పెరిగి రూ.99,200కి చేరుకున్నాయి.