బంగారం ధరలు.. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 10 గ్రాములు గోల్డ్ రేటు ఇలా ఉంది..

బంగారం ధరలు.. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 10 గ్రాములు గోల్డ్ రేటు ఇలా ఉంది..

బంగారం ధరల్లో మంగళవారం (జనవరి 7, 2025) ఎలాంటి మార్పు లేదు. పసిడి ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. బంగారం ధర సోమవారం పది గ్రాములకు రూ.700 తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో రూ.79 వేలు పలుకుతోంది. వెండి ధరలు మాత్రం కేజీకి రూ.300 పెరిగి రూ.90,700కి చేరుకున్నాయి. 99.5 శాతం ప్యూరిటీ గల10 గ్రాముల గోల్డ్ ధర రూ.700 తగ్గి రూ.78,600 కి దిగొచ్చింది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 10 గ్రాములు గోల్డ్ రేటు (99.9 శాతం ప్యూరిటీ) రూ.78,710, కేజీ వెండి ధర రూ.99 వేలు పలుకుతున్నాయి.

మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో కూడా ఫిబ్రవరి గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల రేట్లు సోమవారం తగ్గాయి. 10 గ్రాముల ధర రూ.247 తగ్గి  రూ.77,070 వద్ద ట్రేడవుతోంది.  సిల్వర్ ఫ్యూచర్స్ రేటు కేజీకి రూ.479 (0.54 శాతం) పెరిగి రూ.89,700 దగ్గర కదులుతోంది. డాలర్ వాల్యూ, యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ పెరిగినా కిందటి వారం గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సిల్వర్ ధరలు తమ  నష్టాల నుంచి రికవర్ కాగలిగాయని మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ ఎనలిస్ట్ రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలంత్రి అన్నారు. యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యూరప్ దేశాల ఎకనామిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డేటా మెరుగ్గా లేకపోవడంతో బంగారం, వెండి ధరలు నిలకడగా ఉన్నాయని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు గత నవంబరులో 53 టన్నుల బంగారం కొనగా, ఆర్బీఐ ఎనిమిది టన్నులు కొన్నది. వరల్డ్​ గోల్డ్​ కౌన్సిల్​ రిపోర్ట్​ప్రకారం.. వర్ధమాన దేశాల సెంట్రల్ బ్యాంకులే ఎక్కువ బంగారం కొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితులు పెరుగుతున్నందున, సురక్షిత, నిలకడైన ఆస్తి కోసం ఇవి పసిడిని ఎంచుకున్నాయి. అమెరికా ఎన్నికల కారణంగా నవంబరులో బంగారం ధర తగ్గింది.

అందుకే బ్యాంకులు విపరీతంగా కొనుగోళ్లు జరిపాయి. ఆర్బీఐ గత ఏడాదిలో 73 టన్నులు కొనుగోలు చేసింది. దీంతో మొత్తం నిల్వలు 876 టన్నులకు చేరాయి. నేషనల్​బ్యాంక్ ​ఆఫ్​ పోలండ్​90 టన్నులు కొనడంతో మొత్తం నిల్వలు 448 టన్నులకు చేరాయి. చైనా ఐదు టన్నుల బంగారాన్ని మాత్రమే కొనుగోలు చేసింది. గత ఏడాది మొత్తం 34 టన్నుల కొన్నది.