వెండే బంగారమాయే..ఈ ఏడాది 30 శాతం పెరిగిన సిల్వర్‌‌‌‌ ధర

వెండే బంగారమాయే..ఈ ఏడాది 30 శాతం పెరిగిన సిల్వర్‌‌‌‌ ధర
  • పరిశ్రమల నుంచి ఫుల్‌‌ డిమాండ్‌‌ 
  • ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు మంచి ఆప్షన్

బిజినెస్‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌, వెలుగు : తాజాగా బంగారాన్ని మించి వెండి (సిల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)  మెరుస్తోంది. కేజి వెండి ధర  సగటున రూ.91 వేల నుంచి 95 వేల మధ్య ఉంది. కిందటి నెలలో  బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ కంటే ఎక్కువ రిటర్న్ ఇచ్చింది. వెండి ధరలు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయని, ముఖ్యంగా గోల్డ్ రేట్లు పెరుగుతుండడంతో వెండి ధరలు కూడా చుక్కలనంటుతున్నాయని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.  కామెక్స్‌‌‌‌‌‌‌‌ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌లో సిల్వర్ ధరలు ఈ ఏడాది 30 శాతం పెరిగాయని కోటక్ సెక్యూరిటీస్  కమొడిటీ రీసెర్చ్ సీనియర్ మేనేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కైనట్ చైన్‌‌‌‌‌‌‌‌వాలా అన్నారు.  

ఎంసీఎక్స్‌‌‌‌‌‌‌‌లో కూడా  సిల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధర ఆల్ టైమ్ రికార్డ్ రూ.95,500 (కేజి) కు పెద్ద దూరంలో లేదని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌ వెహికల్స్‌‌‌‌‌‌‌‌, హైబ్రిడ్ కార్లు, సోలార్ ప్యానెల్స్‌‌‌‌‌‌‌‌  తయారీలో  సిల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వాడతారు. తయారీ రంగంలో వెండికి డిమాండ్ పెరుగుతోంది.  ‘ వెండి ఇండస్ట్రియల్ డిమాండ్  ఈ ఏడాది 9 శాతం పెరిగి 71.09 కోట్ల ఔన్స్‌‌‌‌‌‌‌‌లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నాం. సోలార్ ప్యానెల్స్‌‌‌‌‌‌‌‌లో వాడే ఫోటోవోల్టాయిక్ డిమాండ్ 20 శాతం పెరుగుతుందన్న నేపథ్యంలో వెండికి ఫుల్ గిరాకీ ఉంది’ అని చైన్‌‌‌‌‌‌‌‌వాలా అన్నారు. యూఎస్‌‌‌‌‌‌‌‌ ఎకానమీ మెరుగవుతుందనే అంచనాలు ఉండడంతో గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా  తయారీ రంగం ఊపందుకుంటుందని పేర్కొన్నారు.  మీడియం టెర్మ్‌‌‌‌‌‌‌‌లో వెండి ధరలు తగ్గితే కొనుక్కోవచ్చని సలహా ఇచ్చారు. 

సిల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈటీఎఫ్‌‌‌‌‌‌‌‌లు మంచివేనా? 

సిల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెట్టుబడి పెట్టాలనుకునే వారు సిల్వర్ ఈటీఎఫ్‌‌‌‌‌‌‌‌లను ప్రయత్నించొచ్చు. ప్రీసియస్ మెటల్ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌లో ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లను డైవర్సిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఎనలిస్టులు పేర్కొన్నారు. ‘సిల్వర్ బార్లు లేదా కాయిన్లతో పోలిస్తే  సిల్వర్‌‌‌‌‌‌‌‌ ఈటీఎఫ్‌‌‌‌‌‌‌‌లను కనీసం ఒక యూనిట్ నుంచి కొనుక్కోవచ్చు.  ఒక సిల్వర్ ఈటీఎఫ్ యూనిట్ ధర  తక్కువుగా ఉంటుంది. ఉదాహరణకు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ సిల్వర్ ఈటీఎఫ్‌‌‌‌‌‌‌‌ ఒక యూనిట్ ధర రూ.91 ( కిందటి నెల 31 నాటికి). దీంతో పాటు స్టోరేజ్‌‌‌‌‌‌‌‌, ఇన్సూరెన్స్ ఖర్చులు వంటి భారం ఉండదు.

అన్ని యూనిట్లు  డీమాట్ అకౌంట్‌‌‌‌‌‌‌‌లో యాడ్ అవుతాయి’ అని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ప్రిన్సిపల్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ స్ట్రాటజిస్ట్‌‌ చింతన్ హరియా అన్నారు. గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా నాన్ ఇండస్ట్రియల్ అవసరాలకే  40 శాతం సిల్వర్ వినియోగం జరుగుతోందని  నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ ఎనలిస్ట్ విక్రమ్‌‌‌‌‌‌‌‌ ధావన్ అన్నారు.  ఈటీఎఫ్‌‌‌‌‌‌‌‌లతో  క్వాలిటీ, ప్యూరిటీ ఎక్కువగా ఉన్న సిల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇన్వెస్ట్ చేయడానికి వీలుంటుందని తెలిపారు. పారదర్శకత, అథంటిసిటీ ఉంటుందని 
అన్నారు.

ధరలు మరింత పైకి!

సాధారణంగా గోల్డ్‌‌‌‌‌‌‌‌తో పాటే సిల్వర్ ధరలు కూడా పెరుగుతాయి.  ఈ ఏడాది గోల్డ్‌‌‌‌‌‌‌‌ను మించి సిల్వర్ రేట్లు పెరిగాయి.  ఫండమెంటల్స్ స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌గా ఉండడంతో ఈ ఏడాదిలో  సిల్వర్ రేట్లు మరింత పెరగొచ్చని  ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. గ్రీన్ టెక్‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్, సోలార్ ప్యానెల్స్‌‌‌‌‌‌‌‌ తయారీలో సిల్వర్ వాడకం పెరుగుతుండడంతో  ఇండస్ట్రియల్ డిమాండ్ ఎక్కువగా ఉందని అన్నారు. సప్లయ్ తక్కువుగా ఉండడంతో , డిమాండ్ బాగుండడంతో  పెట్టుబడులకు సిల్వర్ మంచి ఆప్షన్ అని చింతన్ పేర్కొన్నారు.

కాగా, గ్లోబల్‌‌‌‌‌‌‌‌ సిల్వర్ ఈటీఎఫ్‌‌‌‌‌‌‌‌  సైజ్‌‌‌‌‌‌‌‌ 69.90 కోట్ల ట్రాయ్ ఔన్స్‌‌‌‌‌‌‌‌లుగా ఉంది.  2022 ప్రారంభంలో 88.70 కోట్ల ట్రాయ్ ఔన్స్‌‌‌‌‌‌‌‌లుగా రికార్డయ్యింది. దీంతో పోలిస్తే 22 శాతం తగ్గింది. సగటున సిల్వర్ ఈటీఎఫ్‌‌‌‌‌‌‌‌లను 2.5 ఏళ్లు హోల్డ్ చేస్తున్నారు. ఈక్విటీ మార్కెట్‌‌‌‌‌‌‌‌లు పెరుగుతుండడంతో ఈటీఎఫ్‌‌‌‌‌‌‌‌లలోకి ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లోస్ తగ్గుతున్నాయి.