కరెంటు స్కూటర్ల ధరలు తగ్గాయ్

కరెంటు స్కూటర్ల ధరలు తగ్గాయ్

న్యూఢిల్లీ: తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను తగ్గించినట్టు హీరో ఎలక్ట్రిక్‌‌‌‌ కంపెనీ ప్రకటించింది.   మోడల్‌‌‌‌ను బట్టి ధరలను 12శాతం నుండి 33శాతం వరకు తగ్గించినట్లు తెలిపింది. దేశంలోని 650లకుపైగా ఉన్న హీరో ఎలక్ట్రిక్‌‌‌‌ టచ్ పాయింట్లలో తగ్గింపు ధరలకే బండ్లను అమ్ముతున్నామని పేర్కొంది. డిస్కౌంట్లతోపాటు, హోమ్ డెలివరీలు, తక్కువ వడ్డీకి ఫైనాన్స్‌‌‌‌, ఎక్సెండెడ్‌‌‌‌ వారెంటీలను కూడా అందిస్తామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఎలక్ట్రిక్ టూవీలర్లకు ఇచ్చే సబ్సిడీని (ఒక్కో కిలోవాట్ హవర్‌‌‌‌కు) రూ. 15వేలు కు పెంచినట్లు కేంద్రం ఇటీవల ప్రకటించింది. హీరోతోపాటు ఒకినావా, టీవీఎస్‌‌‌‌ వంటి ఈ–టూవీలర్‌‌‌‌ కంపెనీలు కూడా రేట్లు తగ్గించాయి. ఆంపియర్ మోడల్స్‌‌‌‌పై రూ.9 వేల వరకు, టీవీఎస్ ఐక్యూబ్ ధర రూ.11,250, ఎథర్ ఎనర్జీ బైకుల ధరలు రూ.14,500, ఒకినావా మోడల్స్‌‌‌‌ ధరలు రూ.7,200-- నుంచి 17,800 వరకు, రివాల్ట్ ఈ–బైక్‌‌‌‌ ధర రూ.10 వేల వరకు తగ్గింది. మరో విషయం ఏమంటే..  ఎలక్ట్రిక్ వెహికల్స్‌‌‌‌ను మరింత ఎంకరేజ్ చేయడానికి వీటికి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ) తీసుకోవాల్సిన అవసరం లేకుండా మినహాయింపులు ఇవ్వాలని, రెన్యువల్ ఫీజును రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.  2030 నాటికి కార్బన్ వాయువులను మూడో వంతు తగ్గిస్తామని ప్రకటించిన నేపథ్యంలో మోడీ ప్రభుత్వం ఈ ప్రపోజల్‌‌‌‌ను పరిశీలిస్తోంది. టెస్లా వంటి గిగా ఫ్యాక్టరీలను నిర్మించడానికి, ఈవీల బ్యాటరీలను తయారు చేయడానికి  రూ. 18,100 కోట్ల విలువైన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌‌‌‌ఐ) పథకాన్ని ఇప్పటికే ప్రభుత్వం ఆమోదించింది.  తాజాగా గుజరాత్​ కూడా ఈవీ పాలసీ తెచ్చింది.

ఈవీలకు తిరుగులేదు
‘‘ఎలక్ట్రిక్‌‌ వెహికల్స్​కు తిరుగులేదు. ఈవీల విప్లవం వస్తోంది. కర్ణాటక 2017లోనే కరెంటు బండ్లకు ఇన్సెంటివ్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. గత వారం గుజరాత్‌‌ కూడా సబ్సిడీలు ప్రకటించింది. ఇప్పటి వరకు 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇన్సెంటివ్స్‌‌ ఇస్తున్నాయి.  మేం రూ.500 కోట్ల ఖర్చుతో తమిళనాడులో ఓలా ఫ్యూచర్‌‌ ఫ్యాక్టరీ  నిర్మించాం. మా ఈ–స్కూటర్‌‌ త్వరలోనే రాబోతోంది. దీనికి మంచి కలర్స్‌‌ సూచించాలని జనాన్ని కోరుతున్నాం’’
-భవీశ్‌‌ అగర్వాల్‌‌, ఓలా ఫౌండర్‌‌